ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.. 9 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ!

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే డీఎస్సీ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సెక్రటేరియట్ లో ఈ వివరాలను ప్రకటించారు.  రాష్ట్రంలోని సంక్షేమ శాఖలు, పురపాలిక, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో కలిపి మొత్తం 9,275 పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటన్నింటిని డీఎస్పీ పరీక్షల ద్వారానే భర్తీ చేస్తామన్నారు.

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లను కలిపి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.

షెడ్యూల్‌ ఇలా..
  • టీఆర్టీ, టెట్ నోటిషికేషన్ 10.10.2018
  • దరఖాస్తు రుసుము చెల్లింపు 10.10.2018 - 02.11.2018
  • దరఖాస్తు సమర్పణకు తుది గడువు 03.11.2018
  • హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ 20.11.2018 నుంచి
  • పరీక్ష నిర్వహణ 30.11.2018 - 14.12.2018
  • ప్రాథమిక ‘కీ’ విడుదల 16.12.2018
  • అభ్యంతరాల స్వీకరణ 16 - 23.12.2018 వరకు
  • తుది ‘కీ’ విడుదల 27.12.2018
  • ఫలితాలు 03.01.2019
Go Back to Shorts
DSC
Andhra Pradesh
2018
TEACHERS
Ganta Srinivasa Rao

More Telugu News