ఎక్కడైతే టీఆర్ఎస్ కు చోటు లేదని చెప్పారో, అక్కడే గెలిచాం: సీఎం కేసీఆర్

  • నల్గొండ జిల్లాతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి
  • టీఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాలి
  • కొత్త రాష్ట్రం తిప్పలు.. మరోపక్క ఏపీ సీఎం కుట్రలు
2014 ఎన్నికల్లో .. ఎక్కడైతే టీఆర్ఎస్ కు చోటు లేదని చెప్పారో, అక్కడే ఆరు సీట్లు గెలిచామని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, నల్గొండ జిల్లాతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, తాను మడమ తిప్పనన్న నమ్మకంతోనే ప్రజలు గతంలో తనకు అండగా ఉన్నారని, టీఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాలని పిలుపు నిచ్చారు.

ప్రభుత్వం ఏర్పాటైన నాడు కొత్త కుండలో ఈగ చచ్చినట్టు అనేక అడ్డంకులు, అవరోధాలు, ఒక పక్క కొత్త రాష్ట్రం తిప్పలు.. మరోపక్క ఏపీ సీఎం కుట్రలు పట్టి పీడించాయని అన్నారు. ఐదారు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించుకున్నామని, రైతాంగానికి ఇరవై నాలుగు గంటలూ విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. మంచినీళ్ల సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చామని, ఇంటింటికీ రెండు నెలల్లో నీళ్లు రాబోతున్నాయని, అసెంబ్లీలో చెప్పిన మాట నెరవేరబోతుందని కేసీఆర్ చెప్పారు. 
Go Back to Shorts
TRS
kcr
nalgonda

More Telugu News