తెలంగాణ ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లండి.. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచన!
- సుప్రీంకోర్టు తలుపు తట్టిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి
- 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపణ
- అన్ని పిటిషన్లను రేపే విచారించాలని హైకోర్టుకు సూచన
తెలంగాణలో దాదాపు 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయనీ, వీటిని తొలగించకుండా ఎన్నికలకు వెళుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.. ఈ ఓట్ల వ్యవహారం తేలేవరకూ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఓటర్ జాబితా సవరణకు సోమవారం వరకే గడువు మిగిలిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. రేపు మధ్యాహ్నం 4 గంటలలోపు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లను రేపే విచారించాలని సుప్రీం హైకోర్టును ఆదేశించింది.