ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్న బాలకృష్ణ, విజయశాంతి!
- 1990 దశకంలో సూపర్ హిట్ పెయిర్
- ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి వేర్వేరు పార్టీల్లో
- తెలంగాణ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ పొత్తు
- కలసి పని చేయనున్న బాలకృష్ణ, విజయశాంతి
ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణలో జరిగే ఓ బహిరంగ సభలో వీరిద్దరూ కలసి పాల్గొంటారని తెలుస్తోంది. వచ్చే 40 రోజుల్లో 90 నియోజకవర్గాల్లో విజయశాంతి పర్యటనలు ఇప్పటికే ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ సైతం ప్రజల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్యను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. చాలా రోజుల తరువాత వీరిద్దరూ కలసి ఓ కూటమి తరఫున పనిచేయనుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.