శర్వానంద్ ను ఒప్పించే ప్రయత్నంలో యంగ్ డైరెక్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ ను ఒప్పించే ప్రయత్నంలో యంగ్ డైరెక్టర్

  • సుధీర్ బాబుకి హిట్ ఇచ్చిన నాయుడు 
  • తదుపరి ప్రాజెక్టుకు ప్రయత్నాలు 
  • సిద్ధంగా వున్న నిర్మాతలు        
ఇటీవల యూత్ ప్రేక్షకులను పలకరించిన ప్రేమకథా చిత్రాలలో 'నన్ను దోచుకుందువటే' ఒకటి. సుధీర్ బాబు .. నభా నటేశ్ జంటగా ఆర్.ఎస్.నాయుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆర్. ఎస్. నాయుడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. తమ బ్యానర్లో సినిమా చేసిపెట్టమని ఆయనను చాలామంది దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారట.

'పడి పడి లేచె మనసు' నిర్మాత సుధాకర్ తో పాటు, మరో ఇద్దరు నిర్మాతలు ఆర్.ఎస్.నాయుడితో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. దాంతో తన తదుపరి సినిమాను శర్వానంద్ తో చేయాలనే ఆలోచనలో నాయుడు వున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఆయన శర్వానంద్ ను కలిసి ఒక లైన్ వినిపించాడని చెబుతున్నారు. ఆయనని ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని అంటున్నారు. శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి మరి.     
sharwanand

More Telugu News