అగ్నికీలల్లో మెడికల్ కళాశాల ఆస్పత్రి : 250 మందికి తృటిలో తప్పిన ప్రమాదం
- ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌లో తొలుత వ్యాపించిన మంటలు
- భయంతో కిటికీల్లోంచి దూకేసిన కొందరు రోగులు
- మంటలార్పుతున్న పది అగ్నిమాపక శకటాలు
దాంతో ఎవరికి వారు సమీపంలోని కిటికీల నుంచి దూకి చాలామంది తప్పించుకున్నారు. కదలలేని రోగులు నిస్సహాయ స్థితిలో సహాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మిగిలిన రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆస్పత్రిలోని రోగులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. పది అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.