మేనిఫెస్టోలో బీజేపీ బంపరాఫర్.. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న వారికి నెలకు రూ.5 వేలు!
- బీజేపీ ముసాయిదా మేనిఫెస్టో విడుదల
- నెలకు రూ.5 వేల అద్దె
- విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
- సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఉచిత విద్యుత్
బీజేపీ మేనిఫెస్టో కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టో ప్రకారం.. భాగ్యనగరంలో అద్దెకు ఉంటున్న ప్రతీ కుటుంబానికి నెలకు రూ.5వేలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. నీటి పన్నును ఆరు రూపాయలు వసూలు చేస్తారు. కాలుష్య నియంత్రణకు ఆటో, వ్యాన్ మార్పిడి పథకం. డప్పు కొట్టే వారు, చెప్పులు కుట్టే వారికి నెలకు రూ.3 వేల పింఛన్. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఉచిత విద్యుత్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు, డిగ్రీ పైస్థాయి ఉద్యోగులకు ఉచిత ల్యాప్ టాప్‌లు, 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు, చేతి, కుల వృత్తుల వారికి రూ.3 వేల పింఛన్, ప్రతీ ఏడాది ఉద్యోగాల భర్తీ చేస్తారు.