Araku: మావోయిస్టులు భూస్థాపితమయ్యే సమయమిదే: మన్యం గిరిజనుల పేరిట పోస్టర్లు

షార్ట్స్‌లో చూడండి
గిరిజన నేతలైన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్యలకు వ్యతిరేకంగా అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పలు పోస్టర్లు వెలశాయి. మావోయిస్టులు భూస్థాపితం అయ్యే రోజులు వచ్చాయని, తమ తరంలో హీరోలైన కిడారి, సోమల హత్యను ఖండిస్తున్నామని ఈ పోస్టర్లలో గిరిజనుల పేరిట పేర్కొన్నారు.

గిరిజన ద్రోహులుగా తయారైన మావోలను తరిమి కొడతామని తెలుపుతూ, 'మన్యం గిరిజనుల' పేరిట వెలిసిన ఈ మావోయిస్టుల వ్యతిరేక పోస్టర్లు ఇప్పుడు పలు కూడళ్లలో దర్శనమిస్తున్నాయి. ప్రజలను చంపే కర్కశత్వం కలిగున్న మావోయిస్టులను తరిమేస్తామని హెచ్చరించారు. ఇవి ఎవరు ప్రింట్ చేయించారన్న విషయమై సమాచారం లేకపోయినా, ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు వీటి గురించే చర్చించుకుంటున్నారు.
Go Back to Shorts
Araku
Paderu
Maoists
Posters

More Telugu News