KTR: కేటీఆర్ కు దమ్ముంటే వరంగల్ జిల్లా ఇన్ ఛార్జిగా బాధ్యతలు తీసుకోవాలి: కొండా మురళి సవాల్

షార్ట్స్‌లో చూడండి
కేటీఆర్ కు దమ్ముంటే వరంగల్ జిల్లా ఇన్ ఛార్జి బాధ్యతలు తీసుకోవాలని, ఈ జిల్లాలో ఎన్ని సీట్లు గెలిపించుకుంటారో చెప్పాలని కాంగ్రెస్ నేత కొండా మురళి సవాల్ విసిరారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని సీట్లలో కాంగ్రెస్ నే గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం ఎవరిని అభ్యర్థులుగా నిర్ణయిస్తుందో వారిని గెలిపించుకునే బాధ్యత తమదేనని అన్నారు.

ఎమ్మెల్సీ పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలు రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. పరకాల నియోజకవర్గం నుంచి కొండా సురేఖ పోటీ చేయడం ఖాయమని ఈ సందర్భంగా మురళి చెప్పారు. రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి సబబు కాదని అన్నారు. 
Go Back to Shorts
KTR
konda murali

More Telugu News