బ్రేకింగ్... సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోల మెరుపుదాడి!
- బీజాపూర్ అడవుల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు
- ఈ ఉదయం దాడికి దిగిన మావోయిస్టులు
- గంటపాటు కొనసాగిన ఎదురుకాల్పులు
- అదనపు బలగాలను దించి కూంబింగ్
పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా క్యాంప్ వేసిన భద్రతా దళాలు, అక్కడి నుంచే అడవుల్లోకి వెళ్లి కూంబింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మావోలు, సీఆర్పీఎఫ్ దళాల మధ్య సుమారు గంట పాటు ఎదురుకాల్పులు సాగినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారని, అదనపు బలగాలను రంగంలోకి దించి, వారికోసం గాలింపును ముమ్మరం చేశామని తెలిపారు.