మోదీకి ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటున్న పుల్కిత్ మిశ్రా అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీకి ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటున్న పుల్కిత్ మిశ్రా అరెస్టు

  • పుల్కిత్ మహరాజ్ అలియాస్ పుల్కిత్ మిశ్రా
  • ప్రతీ రాష్ట్రంలో ఇదే విధంగా అబద్ధాలు 
  • వీఐపీ ప్రొటోకాల్ పొందుతున్న వైనం
ప్రధాని నరేంద్ర మోదీకి ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటూ వీఐపీ ప్రొటోకాల్ పొందుతున్న పుల్కిత్ మహరాజ్ అలియాస్ పుల్కిత్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానికి, పుల్కిత్ మిశ్రాకు ఎలాంటి సంబంధం లేదన్న సమాచారం ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తెలుసుకున్న తర్వాతే ఆయన్ని అరెస్టు చేశామని చెప్పారు.

పుల్కిత్ మిశ్రా వెళ్లిన ప్రతి రాష్ట్రంలో ఇదే విధంగా అబద్ధాలు చెబుతున్నాడని, అనేక మంది ప్రముఖులతో ఫొటోలు దిగినట్టు నకిలీ చిత్రాలు సృష్టించాడని చెప్పారు. తాను నివసించేందుకు ఒక నివాసం ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ కూడా ఉండాలని కోరుతూ యూపీలోని సీతాపూర్ జిల్లా కలెక్టర్ కు పుల్కిత్ మిశ్రా ఓ లేఖ రాసిన విషయాన్ని ఢిల్లీ పోలీసులు ప్రస్తావించారు. ఈ లేఖలో తాను కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శినని పుల్కిత్ పరిచయం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
modi
pulkit mishra

More Telugu News