హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • ఎల్బీనగర్, బీఎస్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం
  • రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లోనూ వాన
  • హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు మేఘావృతం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వర్షం కురిసింది. ఎల్బీనగర్, బీఎస్ రెడ్డి నగర్, నాగోల్, పహాడీ షరీప్, వెంకటాపూర్, మల్లాపూర్, బాలపూర్ లో వర్షం కురిసింది. వికారాబాద్ లోని మోమిన్ పేటలో, ఘట్కేసర్ మండలంలోని పలు గ్రామాల్లోనూ, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ప్రాంతంలోనూ వర్షం కురిసింది. కాగా, అమీర్ పేట్, యూసుఫ్ గూడ, రాజీవ్ నగర్, మోతీనగర్, పంజాగుట్ట, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.
Hyderabad
rain

More Telugu News