అభిమానుల కోసం సిక్స్ ప్యాక్ తో అఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానుల కోసం సిక్స్ ప్యాక్ తో అఖిల్

  • 'మిస్టర్ మజ్ను'తో బిజీగా అఖిల్ 
  • దర్శకుడిగా వెంకీ అట్లూరి 
  • డిసెంబర్లో భారీస్థాయి విడుదల 
అఖిల్ సిక్స్ ప్యాక్ తో వున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అఖిల్ దిగిన ఫోటో ఇది. అఖిల్ ను ఇలా చూస్తుంటే గట్టిగానే కసరత్తు చేసినట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అఖిల్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే అఖిల్ సిక్స్ ప్యాక్ చేశాడని కొంతమంది అంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యంగా పట్టాలెక్కిందని కూడా చెబుతున్నారు. అయితే, అఖిల్ నాల్గొవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మరోపక్క జరుగుతున్నాయనీ, ఆ కథ ప్రకారం అందులో సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడని మరికొందరు అంటున్నారు. ఆ సినిమా కోసమే ఆయన ఈ కసరత్తును కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఎలాగో డిసెంబర్లో వచ్చే 'మిస్టర్ మజ్ను'తో క్లారిటీ వచ్చేస్తుంది లెండి.        
akhil

More Telugu News