Police: మావోయిస్టులు కిడారిని కాల్చి చంపుతున్న వీడియో పోలీసులకు చిక్కింది!

షార్ట్స్‌లో చూడండి
అరకు ఎమ్మెల్యే కిడారి వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారును మావోయిస్టులు చుట్టుముట్టి, ఆయన్ను కిందకు దించి, నడిపించుకుంటూ తీసుకెళ్లిన వీడియో నిన్న విడుదలై కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను పోలీసులే వ్యూహాత్మకంగా విడుదల చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యకు సంబంధించి మావోయిస్టులు చేపట్టిన ఆపరేషన్‌ కు చెందిన పూర్తి వీడియో ఒకటి పోలీసులకు చిక్కినట్టు విశ్వసనీయ సమాచారం.

నేతలను అడ్డగించిన వేళ, వారి గన్ మెన్ల నుంచి సెల్ ఫోన్లను లాక్కున్న మావోయిస్టులు, అదే సమయంలో రోడ్డుపై తమ ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిని కూడా అడ్డగించారు. వారిలో ఒకరు మావోల కళ్లుగప్పి, తన సెల్ ఫోన్ లో మొత్తం ఉదంతాన్ని వీడియో తీయగా, అదిప్పుడు పోలీసుల చేతికి చిక్కింది. అందులో ఒక భాగాన్ని మాత్రమే పోలీసులు బయటకు విడుదల చేశారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు పోలీసుల వద్ద ఉన్నాయని, దాని ద్వారా కొందరు మావోయిస్టులను ఇప్పటికే గుర్తించారని సమాచారం.
Go Back to Shorts
Police
Araku
Kidari
Murder
Maoists
Video

More Telugu News