sensex: తడబడి.. నిలబడి ..చివరకు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. గత ఐదు సెషన్లుగా భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, పెట్రో ధరల పెంపుతో ఇవాళ కూడా సూచీలు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్ 200 పాయింట్లకు పైగా పతనమైంది.

అనంతరం మధ్యాహ్నానికి సూచీలు కొంచెం కోలుకున్నాయి. ఆ తర్వాత మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్లు లాభపడి 36,652కు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పుంజుకుని 11,067కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బలరాంపూర్ చీనీ మిల్స్ (6.88%), ఎన్వోసీఐఎల్ (6.48%), ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.06%), డీసీఎం శ్రీరామ్ (5.77%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (5.74%).

టాప్ లూజర్స్:
దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-23.49%), ఐఎఫ్సీఐ (-11.27%), జెట్ ఎయిర్ వేస్ (-9.81%), వక్రాంగీ (-8.82%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (-8.17%).        
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News