అన్నాడీఎంకే ఆహ్వానపత్రికలో స్టాలిన్, కనిమొళి పేర్లు!
- ఈనెల 30న ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలు
- అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామన్న అన్నాడీఎంకే
- సభలో ప్రసంగించాలనే వారి పేర్లను ముద్రించాం
ఈ అంశంపై మంత్రి, అన్నాడీఎంకే నేత పాండియరాజన్ మాట్లాడుతూ, ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని... ఈ కారణంగానే వేడుకలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అధినేత స్టాలిన్ ను, ఆ పార్టీ ఎంపీ కనిమొళిని ఆహ్వానించామని చెప్పారు. సభలో వారు ప్రసంగించాలనే సదుద్దేశంతోనే వక్తల జాబితాలో వారి పేర్లను ముద్రించామని తెలిపారు. అదే విధంగా దినకరన్ కూడా ప్రసంగించాలనే ఆయన పేరును కూడా ముద్రించామని చెప్పారు. అయితే, ఈ వేడుకల్లో పాల్గొనాలా? వద్దా? అనే నిర్ణయాన్ని మాత్రం వారి అభీష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు.