హెచ్1బీ వీసాదారులకు షాక్ ఇచ్చిన ట్రంప్ సర్కార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్1బీ వీసాదారులకు షాక్ ఇచ్చిన ట్రంప్ సర్కార్

  • హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గడ్డుకాలం
  • హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు రద్దు
  • మూడు నెలల్లోగా అధికారిక నిర్ణయం
అమెరికాకు హెచ్ 1బీ వీసాలపై వెళ్లి, అక్కడ పని చేస్తున్న వారికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసేందుకు అనుమతించే పర్మిట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని నేడు అమెరికా ఫెడరల్ కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై మరో మూడు నెలల్లోగా అధికారిక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

హెచ్ 1బీ వీసాదారులు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారి జీవిత భాగస్వాములు హెచ్4 డిపెండెంట్ వీసాతో ఉద్యోగాలు చేయవచ్చంటూ గత ఒబామా ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. ఒబామా నిర్ణయం వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 28న ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కొన్ని కారణాల వల్ల దీని అమలు వాయిదా పడుతూ వచ్చింది.

మరోవైపు, హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. 2017 డిసెంబర్ 25 నాటికి 1,26,853 మంది హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను అమెరికా మంజూరు చేసింది. వీరిలో 93 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. కేవలం ఐదు శాతం మంది చైనీయులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే... ఒక్కరి జీతంతోనే కుటుంబం మొత్తం నడవాల్సి ఉంటుంది. 
H-1B Visa
H4 Visa
america
work permit

More Telugu News