తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్న విజయశాంతి!
- టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి
- పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషిస్తారని భావిస్తున్న నాయకత్వం
- ఇప్పటికే టీడీపీతో పొత్తును వ్యతిరేకించిన విజయశాంతి
ఇటీవల హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్భంలో... ఆమె మళ్లీ కనిపించారు. రాజకీయాలల్లో ఇకపై క్రియాశీలకంగా ఉంటానని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది. మరోవైపు, టీడీపీతో పొత్తును ఇంతకు ముందే ఆమె వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.