మా కాంబినేషన్లో మరో హిట్ 'చట్టంతో పోరాటం': పరుచూరి గోపాలకృష్ణ
- 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' బాపయ్య చేయవలసింది
- ఆ కథ తనకి నచ్చలేదని అన్నారు
- తాతినేని రామారావు తీస్తే హిట్ అయింది
"ఆ కథను నేను ఎందుకు వద్దన్నాను .. ఆ తరువాత ఏమైనా మార్చారా" అని ఆయన మమ్మల్ని అడిగారు. 'అలాంటిదేం లేదు .. మీ జోనర్ వేరు .. అందువలన అలా అనిపించి ఉంటుంది' అని చెప్పాము. ఆ తరువాత బాపయ్యగారితో కలిసి 'చట్టంతో పోరాటం' చేశాము. మా కాంబినేషన్లో వచ్చిన మరో అద్భుతమైన హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా హిందీ రైట్స్ అమ్ముడైనప్పుడు మాకు డబ్బులు ఇప్పించింది బాపయ్యగారే" అని చెప్పుకొచ్చారు.