డబ్బివ్వకుంటే ఫొటోలు అప్ లోడ్ చేస్తుందట... యువకుడికి యువతి బెదిరింపులు!
- ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకుని మాయమాటలు
- యువకుడి నగ్న దృశ్యాలు సేకరించిన మాయలేడి
- డబ్బివ్వకుంటే బయట పెడతానని బెదిరింపులు
అతనికి ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ తరచూ చాటింగ్ చేస్తుండేవారు. తాను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగినని, వివాహమై, ఓ పాప ఉందని, భర్త దూరంగా హైదరాబాద్ లో పని చేస్తున్నాడని చెప్పింది. నువ్వంటే ఇష్టమని చెబుతూ, ఇటీవల తన న్యూడ్ ఫొటో అంటూ ఓ ఫొటో పంపింది. నీ నగ్న చిత్రం కూడా కావాలని కోరింది. దీంతో అతను తన ఫొటోను తీసి పంపాడు. ఆ మరుసటి రోజే, తనకు డబ్బు కావాలని, ఇవ్వకుంటే, ఫొటోను అప్ లోడ్ చేస్తానని బెదిరించింది. ఆమె బెదిరింపులు ఎక్కువ కావడంతో, బాధితుడు విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.