Chandrababu: రూ. 500లతో పోయే కేసు ఇది.. వారం ముందే శివాజీకి ఎలా తెలుసు?: విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
బాబ్లీ కేసులో వచ్చిన అరెస్ట్ వారెంట్ ను టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇది రూ. 500లతో పోయే ఓ చెత్త కేసు అని... ఇలాంటి కేసును పట్టుకుని ఏదో జరిగిపోతున్నట్టు టీడీపీ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ నేతలు నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రచారాల వల్ల ఎలాంటి సానుభూతి రాదని అన్నారు. కోర్టు నుంచి నోటీసులు వస్తే... ప్రధాని మోదీనే ఇదంతా చేయించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానిస్తుండటం హాస్యాస్పదమని చెప్పారు. చంద్రబాబుకు నోటీసులు వస్తాయనే విషయం హీరో శివాజీకి వారం రోజుల ముందే ఎలా తెలుసని విష్ణు ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
babli
modi
vishnu kumar raju

More Telugu News