గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో శిక్ష అనుభవించిన మహ్మద్ బారీతో ప్రణయ్ హత్యకు మాస్టర్ ప్లాన్!
- పరువుహత్య కేసులో సంచలన నిజాలు
- మహ్మద్ బారీతో ఐదేళ్ల క్రితం మారుతీరావుకు పరిచయం
- హత్యకు సహకరించాలని భారీగా డబ్బు
ఐదారేళ్ల క్రితం భూ కబ్జా వివాదంలో బారీ మిర్యాలగూడకు వచ్చిన వేళ, మారుతీరావు కలుగజేసుకుని సయోధ్య చేశాడని, అప్పటి పరిచయమే, ఈ హత్యకు అతని సాయాన్ని కోరేలా చేసిందని పోలీసులు వెల్లడించారు. హత్యకు ప్లాన్ చేసిన తరువాత బారీకి కరీమ్ ఆశ్రయం ఇచ్చాడని, డబ్బులు కూడా కరీమ్ ద్వారానే బారీకి అందాయని, వీరితో పాటు రంగా రంజిత్, శ్రీకర్, షఫీ అనే యువకులనూ అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.