rajasingh: రాజాసింగ్‌ రాజీనామాను తిరస్కరించిన బీజేపీ అధిష్ఠానం

హైదరాబాద్‌లోని గోషామహల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇటీవల పార్టీకి చేసిన రాజీనామాను బీజేపీ అధిష్ఠానం తిరస్కరించింది. ఈ విషయాన్ని శనివారం విలేకరులకు వెల్లడించిన రాజాసింగ్ అనంతరం తెలంగాణ రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

‘రాజకీయ వ్యాఖ్యలు సుతిమెత్తగా ఉండాలి. ఎవరినీ మనస్తాపానికి గురిచేయకూడదు’ అని ఈ సందర్భంగా అమిత్‌ షా రాజాసింగ్‌కు సూచించారు. పార్టీ బలోపేతానికి కృషిచేసి రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. 
rajasingh
BJP
amitsha
Telangana

More Telugu News