Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరింత శక్తి వచ్చిందంటున్న సమంత!
  • ఈ నెలలోనే 'సామి'గా వస్తున్న విక్రం
  • తెలుగులో సంగీత దర్శకుడి సొంత చిత్రం

*  పెళ్లయ్యాక మరింత స్ట్రాంగ్ గా తయారయ్యానని చెబుతోంది అందాలభామ సమంత. "అవును, పెళ్లయ్యాక మరింత బలం వచ్చింది. మరింత శక్తిమంతంగా తయారయ్యా. ఇంట్లో నాకు మంచి సపోర్ట్ వుంది. మాది హ్యాపీ ఫ్యామిలీ. ఇక పిల్లలంటారా.. ఎప్పుడనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు' అని చెప్పింది.    
*  ప్రముఖ నటుడు విక్రం హీరోగా హరి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'సామి స్క్వేర్' చిత్రాన్ని 'సామి' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. కీర్తి సురేశ్, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తారు.
*  ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి 'ప్యార్ ప్రేమ కాదల్' పేరిట తమిళంలో నిర్మించిన చిత్రం అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులోకి అనువదించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

More Telugu News