చంద్రబాబు సెక్యూరిటీలో బెల్జియం శునకం!
- బాంబ్ స్క్వాడ్ లో మెల్నాయిస్ జాతి శునకం
- శ్రీశైలంలో సేవలందిస్తున్న మేలుజాతి శునకం
- చంద్రబాబు భద్రత నిమిత్తం వినియోగించడం ఇదే తొలిసారి
ప్రస్తుతం నెల్లూరు జిల్లా పోలీసులకు సేవలందిస్తున్న ఈ శునకాన్ని, శ్రీశైలానికి తెచ్చిన అధికారులు, హెలిప్యాడ్, చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో తనిఖీలకు వినియోగించారు. చురుకుగా ఉండటం, తక్కువ విశ్రాంతి తీసుకుని ఎక్కువగా పనిచేయడం ఈ శునకం స్పెషాలిటీ. గత ఏప్రిల్ లో బెల్జియం నుంచి 8 శునకాలను తీసుకురాగా, వీటి సేవలను చంద్రబాబు భద్రత నిమిత్తం వినియోగించడం ఇదే తొలిసారి.