జగ్గారెడ్డి అరెస్ట్‌కు నిరసనగా సంగారెడ్డి బంద్.. కక్ష సాధింపన్న ఉత్తమ్
- అరెస్ట్ అక్రమమన్న కాంగ్రెస్
- పోలీసులు సివిల్ డ్రెస్ లో రావడంపై ఉత్తమ్ సీరియస్
- 2004 నుంచీ ఏం చేశారంటూ ప్రశ్న
జగ్గారెడ్డి అరెస్ట్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిని పోలీసులు సివిల్ డ్రెస్‌లో వచ్చి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 2004లో తప్పుడు పత్రాలు సమర్పిస్తే అధికారులు ఇప్పటి వరకు ఏం చేశారని నిలదీశారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని ఆరోపించారు.