పార్టీలో పట్టుకోసం కరుణానిధి తనయుడు అళగిరి మరో అస్త్రం!
- త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి
- తండ్రి మరణంతో ఖాళీ అయిన తిరువారూర్ నుంచి తానే పోటీ చేయాలన్న ఆలోచన
- తనను పార్టీలో చేర్చుకోకుంటే పోటీ తప్పదని స్టాలిన్‌కు పరోక్ష సంకేతాలు
తండ్రి మృతితో ఖాళీ అయిన తిరువారూర్, బోస్ మృతితో ఖాళీ అయిన తిరుప్పరకుండ్రం నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. తిరువారూర్ స్థానం నుంచి తానే రంగంలోకి దిగి సానుభూతి ఓట్లతో విజయం సాధించి సత్తా చాటాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తిరువారూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి తనకు ఉన్నట్లు సోదరి సెల్వి ద్వారా స్టాలిన్‌కు ఇప్పటికే అళగిరి వర్తమానం పంపారని, పార్టీలో చేర్చుకునేందుకే ఇష్టపడని స్టాలిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారని సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన అళగిరి తాజా నిర్ణయాలతో దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.