Sonia Gandhi: సోనియా గాంధీ పాదాలను మోదీ తాకుతున్నట్టు ఫొటో మార్ఫింగ్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ కాళ్లకు ప్రధాని మోదీ మొక్కుతున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోపై హైదరాబాదులోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ కాళ్లను తాకుతున్నట్టు ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో వైరల్ అవుతోందని, ఇది పూర్తిగా మార్ఫింగ్ ఫొటో అని పేర్కొంటూ సిల్వేరి శ్రీశైలం అనే పాత్రికేయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని, ఈ ఫొటో మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Go Back to Shorts
Sonia Gandhi
Narendra Modi
Hyderabad
polic

More Telugu News