చంద్రబాబునైనా, జగన్ నైనా, ఎవరినైనా సరే.. టార్గెట్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేయడం ఏమిటి?: కేంద్రంపై శివాజీ ఫైర్
- హక్కుల గురించి మాట్లాడితే జైళ్లకు పంపుతున్నారు
- నచ్చని పార్టీలు, ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తున్నారు
- ఇదంతా పొలిటికల్ టెర్రరిజం కాదా?
ఏపీని నాశనం చేయడమే కాకుండా, ఇక్కడి ప్రాంతీయ పార్టీలు మనుగడలో కూడా లేకుండా చేయాలనుకోవడం దారుణమని శివాజీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసి ఉంటే... రెండు నెలలు, నాలుగు నెలలు లేదా సంవత్సర కాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని... ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దాడికి దిగడం ఏమిటని మండిపడ్డారు. చంద్రబాబునైనా, జగన్ నైనా లేదా ఎవరినైనా సరే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి... రాష్ట్రాన్ని నాశనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రాణాలకు తెగించి తాను పోరాడుతున్నానని... ఈ రాష్ట్రంపై తనకున్న అభిమానమే దానికి కారణమని హీరో శివాజీ అన్నారు.