కేసీఆర్ ను చిన్న మాట అన్నా.. మీ బతుకేందో చూస్తాం!: కొండా సురేఖకు వరంగల్ మేయర్ నరేందర్ హెచ్చరిక
- రెండేళ్ల నుంచి మీ తీరును ప్రజలు గమనిస్తున్నారు
- ఉదయం ఉత్తమ్ ను కలుస్తారు.. సాయంత్రం టీఆర్ఎస్ ఆఫీస్ కు వస్తారు
- మిమ్మల్ని చూసి భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు
'మేడమ్ సురేఖ గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు గత రెండేళ్ల నుంచి మీ తీరును గమనిస్తున్నారు. మీకు సంబంధించి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మీకు తెలుస్తుంది' అని అన్నారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి అన్నీ తమవేనని నరేందర్ చెప్పారు. మీ రాజకీయ నైపుణ్యం, మీ బలం, బలగం అన్నీ చూద్దాం, చూసుకుందామని అన్నారు. మరో మహబూబాబాద్ ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ ను చిన్న మాట అన్నా మీ బతుకేందో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని చూసి భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు.