కొండా దంపతులు టికెట్ కోసం కేసీఆర్ ను ఇంటికొచ్చి బ్రతిమాలారు!: టీఆర్ఎస్ నేత వినయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొండా దంపతులు టికెట్ కోసం కేసీఆర్ ను ఇంటికొచ్చి బ్రతిమాలారు!: టీఆర్ఎస్ నేత వినయ్

  • కేసీఆర్ పెద్ద మనసుతో పార్టీ టికెట్ ఇచ్చారు
  • టీఆర్ఎస్ లో చేరాక వీరి వ్యవహారశైలి మారింది
  • కొండా మురళి వెంటనే రాజీనామా చేయాలి
బీసీని కాబట్టే తనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించలేదని కొండా సురేఖ ఆరోపించడాన్ని ఆ పార్టీ నేత, వరంగల్(వెస్ట్) మాజీ ఎమ్మెల్యే డి.వినయ్ భాస్కర్ ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. కొండా దంపతులు ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇంటికొచ్చి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా బ్రతిమాలారని, దీంతో కేసీఆర్ పెద్ద మనసుతో వరంగల్ ఈస్ట్ స్థానాన్ని సురేఖకు అప్పగించారని వెల్లడించారు. అయితే పార్టీలో చేరాక కొండా దంపతుల వ్యవహారశైలి మారిందని వ్యాఖ్యానించారు.

కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీతో రహస్య అజెండా ఉందనీ, ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే చెప్పారని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను అడ్డు పెట్టుకుని కొండా దంపతులు ఎంతో లబ్ధి పొందారని ఆరోపించారు. కొండా సురేఖ, మురళీ వంటి అవకాశవాదులకు టీఆర్ఎస్ లో స్థానం లేదనీ, మురళీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరిద్దరికి కేసీఆర్ పెద్ద మనసుతో రాజకీయ జీవితం ప్రసాదించారని వినయ్ అన్నారు.
vinay
TRS
Konda Surekha

More Telugu News