మేమెందుకు చేదు అయ్యాం? ఆయనెందుకు తీపి అయ్యారు?: కొండా సురేఖ
- ఎర్రబెల్లికి, మాకు పడదనే విషయం టీఆర్ఎస్ హైకమాండ్ కు తెలుసు
- తమను సంప్రదించకుండానే పార్టీలో చేర్చుకున్నారు
- ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా మాకు ఉంది
తాము రెండు సీట్లు అడిగామని అనడం అబద్ధమని... మధుసూదనాచారికి భూపాలపల్లి టికెట్ ఇవ్వకపోతే ఆ అవకాశం తమకు ఇవ్వాలని మాత్రమే తాము అడిగామని చెప్పారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వల్ల తాము ఎలాంటి లబ్ధి పొందలేదని, పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని తెలిపారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే సత్తా తమకు ఉందని... అవసరమైతే తాను, తన భర్త, తన కుమార్తె మూడు స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పారు.