ఏ శాస్త్రిగారు ఏం చెప్పారో, ఆ పిచ్చిలో కేసీఆర్ పడ్డారు!: రేవంత్ రెడ్డి

  • హస్తసాముద్రికం, చిలకజోస్యం.. నమ్ముకోవడం తగదు
  • కేసీఆర్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది.
  • కేసీఆర్ జాతకం బాగోలేకపోతే, రాష్ట్రం జాతకాన్ని నాశనం చేస్తారా?  
హస్తసాముద్రికం, చిలకజోస్యం, గవ్వలను నమ్ముకుని తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలనుకోవడం సీఎం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఏ శాస్త్రిగారు ఏం చెప్పారో! ఆ పిచ్చిలో పడి, రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. కేసీఆర్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. అసలు, కేసీఆర్ కు జాతకాలు చెప్పే వాళ్లెవరో! ఆయన జాతకం బాగోలేకపోతే, రాష్ట్రం జాతకాన్ని కూడా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇట్లాంటి పిచ్చోడున్న సభలో.. సభకు, సభ్యులకు, ప్రజాస్వామ్య విలువలకూ గౌరవం లేదు. చట్టాలు, శాసనాల పట్ల వారికి అవగాహన ఉందో లేదో?’ అని ప్రశ్నించారు. 
kcr
Revanth Reddy

More Telugu News