ఆటోడ్రైవర్ భార్యకు కలిసొచ్చిన అదృష్టం.. శివమొగ్గ మేయర్‌గా ఎన్నిక!
- కర్ణాటకలోని శివమొగ్గ మునిసిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ విజయం
- తన భార్యను కౌన్సిలర్‌గా నిలబెట్టిన ఆటోడ్రైవర్
- మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మహిళ
సరిగ్గా, ఇక్కడే లతకు అదృష్టం తోడైంది. శివమొగ్గ మేయర్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం, పార్టీలో లత తప్ప మరెవరూ ఎస్సీ మహిళ లేకపోవడంతో మేయర్ పదవికి ఆమె అర్హురాలైంది. అందరూ కలిసి ఆమెను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన భార్య లత మేయర్‌గా ఎన్నిక కావడంపై గణేశ్ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కోసం రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తమ కుటుంబానికి దక్కిన గౌరవం ఇదని పేర్కొన్నాడు.