ఆధార్ లేకున్నా స్కూళ్లలో అడ్మిషన్ ఇవ్వాల్సిందే.. స్పష్టం చేసిన యూఐడీఏఐ!
- అడ్మిషన్ నిరాకరించడం చట్టవిరుద్ధం
- ప్రత్యామ్నాయ పత్రాలను తీసుకోండి
- రాష్ట్రాల సీఎస్ లకు యూఐడీఏఐ సర్క్యులర్
ఇటీవలి కాలంలో కొన్ని పాఠశాలలు ఆధార్ లేదన్న వంకతో విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని యూఐడీఏఐ తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు యూఐడీఏఐ సర్క్యులర్ జారీచేసింది. ఆధార్ కోసం పాఠశాలలు ఒత్తిడి చేయడంతో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. విద్యార్థుల వద్ద ఆధార్ లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.