Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లాభాల్లో సమంత తాజా సినిమా
  • ప్రభాస్ తాజా చిత్రానికి ముహూర్తం 
  • విలన్ వేషం వేస్తున్న రచయిత!

*  సమంత ప్రధాన పాత్ర పోషించిన 'యూ టర్న్' చిత్రం విడుదలకు ముందే లాభాలు సొంతం చేసుకుంది. ఐదు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల ప్రదర్శన హక్కులను ఆరు కోట్లకు అమ్మడం జరిగింది. అలాగే, శాటిలైట్ హక్కులకు కూడా మంచి ఆఫర్లు వున్నాయి. ఈ నెల 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
*  'సాహో' చిత్రం తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 6న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమవుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.
*  ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఆర్టిస్టుగా మారాడు. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రంలో అబ్బూరి రవి విలన్ గా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

More Telugu News