KCR: బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర రూ.400 దాటడం ఖాయం: కేసీఆర్

  • బీజేపీ పెట్టుబడిదారులు... ధనికుల పార్టీ అని కేసీఆర్ విమర్శ
  • బీజేపీ అజెండాలో పేదల సంక్షేమం లేదన్న కేసీఆర్
  • కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్
KCR says Petrol price may touch rs 400 if bjp win 400 seats

బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర రూ.400 దాటడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన బస్సు యాత్ర సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజకీయాల్లో తనకు సిద్దిపేట ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ 2001 నుంచి తనతోనే ఉన్నారని... ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ... ధనికుల పార్టీ అని విమర్శించారు. బీజేపీ అజెండాలో పేదల సంక్షేమం ఎప్పుడూ లేదన్నారు. రైతులు, చేనేత కార్మికుల గురించి ఆ పార్టీ పట్టించుకోదని ఆరోపించారు.

సిరిసిల్లలో బస్సు యాత్ర

కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క దానినీ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం రైతాంగాన్ని వంచించిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో కాంగ్రెస్ దేనినీ అమలు చేయలేదన్నారు.

మహిళలకు ఉచిత బస్సు మాత్రమే అమలవుతోందని... అందులోనూ ఆడవాళ్లు తన్నుకుంటున్నారన్నారు. ఆటో డ్రైవర్లేమో అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారన్నారు. అందరూ కూడా ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కనుక ఏమీ చేయకున్నా ప్రజలు ఓటేశారని.. హామీలను అమలు కూడా చేయరని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News