kumaraswamy: కొడుకుకి పెళ్లి సంబంధం చూసేందుకు విజయవాడకు వచ్చిన కుమారస్వామి!
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు విచ్చేశారు. తన సతీమణి, బంధువులతో కలసి ఆయన బెజవాడకు వచ్చారు. తన కుమారుడికి పెళ్లి సంబంధం చూసేందుకు ఆయన విచ్చేశారు. విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో పెళ్లి సంబంధం కోసం ఆయన వచ్చారు. కాసేపట్లో ఆయన అమ్మాయిని చూసేందుకు తన బంధువులతో కలసి వెళ్లనున్నారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమై, పలు అంశాలపై చర్చించారు.