hari krishna: మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది: ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి
- తెలుగు భాష అంటే హరికృష్ణకు ప్రాణం
- సినీ, రాజకీయ రంగాల్లో ఆయన సేవలు చిరస్మరణీయం
- స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి హరికృష్ణ
టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతిపై కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు.
హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా పలుమార్లు కలిసేవాళ్ళమని, స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి ఆయన అని కొనియాడారు. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణమని, తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని ఆ ప్రకటనలో సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు.