hari krishna: తిరుమల వెంకన్న అంటే హరికృష్ణకు చాలా ఇష్టం.. కానీ..!

షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవేంకటేశ్వరుడు అంటే దివంగత హరికృష్ణకు ఎంతో భక్తి. 2013 వరకు క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి, స్వామివారిని ఆయన దర్శించుకునేవారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం ప్రారంభదినాల్లో తిరుమలకు వెళ్లడం ఆయనకు ఆనవాయతీ. కానీ, 2014లో ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన ఆ ఆనవాయితీ పాటించలేదు. ఆ తర్వాత చంద్రబాబు మనవడు దేవాన్ష్ అన్నప్రాసన జరిగిన 2015 అక్టోబర్ 10న కుటుంబసభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన తిరుమలకు వెళ్లడం అదే చివరిసారి!
Go Back to Shorts
hari krishna
tirumala

More Telugu News