Nagarjuna: నాగార్జునకు బర్త్ డే విషెస్ చెబుతూ రష్మిక సరదా ట్వీట్ !

  • మీ అభిమానిగా..బాడీ గార్డుగా గర్వంగా ఉన్నాను
  • మీ జీవితాన్ని కింగ్ సైజ్ లో జీవించండి
  • మీకు అన్ని వైపుల నుంచి నేను భద్రత కల్పిస్తా

నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయనకు హీరోయిన్ రష్మిక ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. ‘దేవదాస్’లో నటిస్తున్న ఈ హీరోయిన్ ఓ వెరైటీ ట్వీట్ చేసింది. ‘నాగార్జున సార్.. మీ అభిమానిగా, బాడీ గార్డుగా గర్వంగా ఉన్నాను. మీ జీవితాన్ని కింగ్ సైజ్ లో జీవించండి. మీకు అన్ని వైపుల నుంచి నేను భద్రత కల్పిస్తా’ అని అందాల భామ రష్మిక ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా‘దేవదాస్’ సెట్ లో నాగార్జునతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. కాగా, నాగార్జున, నాని నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News