hari krishna: హరికృష్ణకు నివాళులర్పించేందుకు వెళ్తున్న ప్రముఖులు.. భారీగా ట్రాఫిక్ జామ్!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని పలు పాంత్రాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బేగంపేట, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, జీవీకే, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నంలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించడానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు మెహిదీపట్నంలోని ఆయన భౌతికకాయం ఉంచిన నివాసానికి తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులు వేరే మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
hari krishna
mehidipatnam
begumpet

More Telugu News