పది రోజుల్లో రూ.500 కోట్లు తాగేసిన కేరళ మందుబాబులు.. వరదల్లోనూ తగ్గని జోరు!
- మద్యం విక్రయాల్లో కేరళలో సరికొత్త చరిత్ర
- ఆగస్టు 15 నుంచి ఓనమ్ వరకు వందల కోట్ల విక్రయాలు
- సోషల్ మీడియాలో జోకులు
కేరళీయులు పది రోజుల్లో రూ.500 కోట్ల మద్యాన్ని తాగడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వరదల్లో సర్వం పోగొట్టుకున్న ప్రజలు ఆ బాధను మర్చిపోయేందుకు మద్యాన్ని ఆశ్రయించారని కొందరంటే.. చలి బారి నుంచి తప్పించుకునేందుకు తాగారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి వరదల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను ఇలా ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు.