రామయ్య దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామయ్య దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: రోజా

  • రుణమాఫీ కాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డారు
  • రాష్ట్రంలో ఒక్కరికీ రుణమాఫీ కాలేదు
  • చంద్రబాబు కార్మిక ద్రోహి
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు తిరుపతిలో మాట్లాడుతూ, రుణమాఫీ కాలేదని రామయ్య దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని ఆమె విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు హామీలను ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, 'విజయ' పాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయిని రోజా విమర్శించారు. చంద్రబాబు కార్మిక ద్రోహి అని దుయ్యబట్టారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజీని ఇతర జిల్లాలకు తరలించే యత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఈ గ్యారేజీ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు.
roja
Chandrababu

More Telugu News