సరికొత్త లుక్ తో.. 'తేజ్ యాప్' పేరు మార్చిన గూగుల్ సంస్థ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సరికొత్త లుక్ తో.. 'తేజ్ యాప్' పేరు మార్చిన గూగుల్ సంస్థ!

  • 'గూగుల్ పే' గా మార్పు
  • సులువుగా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చు
  • రుణాలు కూడా పొందే అవకాశం
గూగుల్ రూపొందించిన 'తేజ్' యాప్ పేరు మారింది. గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభమైన తేజ్ యాప్ ఏడాది గడిచిపోవడంతో సరికొత్త లుక్ తో 'గూగుల్ పే' గా మార్చినట్లు ఆ సంస్థ ట్విట్టర్ లో పేర్కొంది. పేమెంట్ మోడ్ తో మొట్టమొదటిసారి ఇండియాలో గూగుల్ ప్రవేశపెట్టగా, ఈ ఏడాది కాలంలో రూ.2 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని కంపెనీ తెలిపింది.

కొత్త గూగుల్ పే యాప్ తో సులువుగా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేసుకోవడంతో పాటు బుక్ మై షో, గోఐబిబో, రెడ్‌బస్‌ లాంటి వాటిలో టికెట్ లు సులువుగా బుక్ చేసుకునే వీలు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లతో గూగుల్ పే అనుసంధానం కావడంతో వినియోగదారులు రుణాలు కూడా పొందే అవకాశం ఉందని గూగుల్ పే అధికారి సేన్‌గుప్తా తెలిపారు.
google
googlepay
Tech-News

More Telugu News