చెట్లను నరికించిన డీజీపీ.. భారీ జరిమానాతో చుక్కలు చూపించిన ఎన్జీటీ!
- రిజర్వ్ ఫారెస్ట్ లో డీజీపీ భూమి కొనుగోలు
- అనంతరం చెట్లను నరికించిన అధికారి
- మొట్టికాయలు వేసిన హరిత ట్రైబ్యునల్
అనంతరం అక్కడ ఉన్న 25 సాల్ చెట్లను అనుమతులు తీసుకోకుండా కూల్చేశారు. దీంతో ఈ ఘటనపై ఎన్జీటీ బార్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన ట్రైబ్యునల్ సాక్షాత్తూ ఐపీఎస్ అధికారి పర్యావరణ విధ్వంసానికి దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేలకొరిగిన చెట్ల విలువకు 10 రెట్ల జరిమానా చెల్లించాలని ఈ రోజు తీర్పు ఇచ్చింది. జాతీయ అటవీ విధానం-1998, జాతీయ అడవుల పరిరక్షణ చట్టం-1980 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో భూమి కొనుగోలు చేయడం నేరమని ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది.