తైజూ చేతిలో వరుసగా పదోసారి ఓటమి తరువాత సైనా నెహ్వాల్ స్పందన!
- వరల్డ్ నంబర్ వన్ తైజూ ఇంగ్
- ఆమె ఆట ఊహకందనిది
- అర్థం చేసుకునేలోపే కొత్త షాట్ తో వస్తుందన్న సైనా నెహ్వాల్
అనంతరం మీడియాతో మాట్లాడిన సైనా, ఆమె ఊహకందని వైఖరి తనకు అర్థం కావడం లేదని వాపోయింది. తైజూతో జరిగే మ్యాచ్ లో షాట్ల ఎంపిక, ర్యాలీలను ముగించడంలో తాను మరింత చురుకుగా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఆమె ప్రతి ర్యాలీ విభిన్నంగానే ఉంటుందని, ఆమె వద్ద మరిన్ని భిన్నమైన షాట్లు ఉండి ఉండవచ్చని చెప్పింది. తైజూ ఓ కొరకరాని కొయ్యని అభిప్రాయపడ్డ సైనా, సెమీస్ లో తాను పోరాడానని చెప్పింది. తన షాట్ ను అర్థం చేసుకునేలోపే, కొత్త షాట్ తో విరుచుకుపడుతుందని చెప్పింది. ఇక ఫైనల్ లో తైజుతో సింధుకు 50-50 చాన్సులున్నాయని చెప్పింది.