megastar: మట్టి వినాయక విగ్రహాన్ని ‘మెగాస్టార్’ కు అందజేసిన ‘ఆలివ్ స్వీట్స్’ అధినేత!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకుడు, ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు గత పన్నెండు సంవత్సరాలుగా కాలుష్య నివారణకు విశేష కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వినాయక చవితి పండగకు ముందు మట్టి వినాయక విగ్రహాలను పంపణీ చేయడం ఆయనకు ఆనవాయితి. ఇప్పటి వరకు అలా 5 లక్షలకు పైగా మట్టి వినాయక విగ్రహాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ఉచితంగా పంపిణీ చేశారు.

ఇక ఈ ఏడాది కూడా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ క్రమంలో మట్టి వినాయక తొలి విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం దొరరాజు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. దొరరాజు మాట్లాడుతూ, ఈ ఏడాది 50 వేల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
megastar
doraraju

More Telugu News