అది భద్రతకు సంబంధించిన విషయం.. వివరాలివ్వలేం!: అమిత్ షా భద్రత ఖర్చులపై కేంద్రం
- అమిత్ షా భద్రత ఖర్చుపై వివరాలు అడిగిన జునేజా
- ఇవ్వడం కుదరదన్న సీఐసీ
- హైకోర్టును ఆశ్రయించినా ఫలితం శూన్యం
జునేజా కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు హోంమంత్రిత్వ శాఖ, సీఐసీ తిరస్కరించాయి. ఇందుకు వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు వంటి కారణాలను సాకుగా చూపాయి. దీంతో జునేజా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు జునేజా దరఖాస్తును మరోసారి పరిశీలించాల్సిందిగా సీఐసీకి సూచించింది. అయితే, తొలుత చెప్పిన కారణాలనే మరోమారు చెబుతూ సమాచారం వెల్లడించడం కుదరదని తేల్చి చెప్పింది.