ఖాళీ అవుతున్న వెనిజులా... లాటిన్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలస!
- వెనిజులాలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం
- ఇరుగు పొరుగు దేశాలకు ప్రజల వలస
- 17, 18 తేదీల్లో సమావేశం కానున్న 13 దేశాలు
దక్షిణ అమెరికాలో భాగంగా ఉన్న వెనిజులా, కొలంబియా, గుయానాల మధ్య ఉండగా, లక్షల సంఖ్యలో ప్రజలు ఈ దేశాలకు మూటా ముల్లే సర్దేస్తున్నారు. లాటిన్ అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద వలసని ఐక్యరాజ్యసమితి అభివర్ణించిందంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, వచ్చే నెల 17, 18 తేదీల్లో క్విటోలో సమావేశం కానున్న లాటిన్ అమెరికాలోని 13 దేశాలు, వెనిజులా పరిస్థితిని అంచనా వేయనున్నాయి. వెనిజులాలో ఆర్థిక మాంద్యం తొలగే దిశగా, ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం.